ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటించి చేతులు దులుపుకుంటాయి. స్థానిక అధికారులు లబ్దిదారులను ఎంపిక చేసి నామమాత్రంగా మాత్రమే వారికి అవి కేటాయించినట్టు ప్రకటించి వాటి అమలును అటకెక్కిస్తారు. దీంతో లబ్దిదారులకు ఆశ చావక, తమకు న్యాయంగా దక్కాల్సిన సర్కారీ సాయం దక్కక .. పోరాడి పోరాడి అలసిపోతున్నారు. ఇలాంటి ఓ లబ్దిదారుడు మహారాష్ట్రలో తనను తాను భూమిలో పీకల్లోతు సమాధి చేసుకుని మరీ నిరసనకు దిగాడు. జాల్నా జిల్లాలోని సునీల్ జాదవ్ అనే వ్యక్తి వినూత్నంగా నిరసనకు దిగారు. ప్రభుత్వం తనకు కేటాయించిన 2 ఎకరాల భూమిని ఇప్పటికీ తనకు ఇవ్వలేదని ఆయన ఆవేదనతో ఇలా నిరసనకు దిగాడు. 2019లో మహారాష్ట్ర సర్కారు ‘కరమ్వీర్ దాదాసాహెబ్ గైక్వాడ్ సబ్లీకరణ్ స్వాభిమాన్ స్కీమ్’ కింద సునీల్ జాదవ్ కు 2 ఎకరాల భూమి కేటాయించింది కానీ చేతికి మాత్రం పట్టా ఇవ్వలేదు. తన చేతికి పట్టా అందేవరకు ఇలాగే నిరసన కొనసాగించనున్నట్టు సునీల్ తేల్చి చెప్పాడు.
Maratha fighter: ప్రభుత్వ సాయం కోసం పీకల్లోతు సమాధి అయ్యాడు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES