Sunday, November 16, 2025
Homeనేషనల్Maratha Quota Protesters: మేమూ షేర్ హోల్డర్లమే

Maratha Quota Protesters: మేమూ షేర్ హోల్డర్లమే

Maratha Protesters Storm BSC Buidling: ‘మేమూ షేర్ హోల్డర్లమే. స్టాక్ మార్కెట్ బిల్డింగ్‌లోకి ఎంటరయ్యేందుకు మాకూ హక్కుంది. మా డబ్బులు ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు’ అంటూ మరాఠా కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు సోమవారం ముంబైలోని దలాల్ స్ట్రీట్‌లో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)ప్రధాన కార్యాలయం వద్ద హంగామా సృష్టించారు. 10 శాతం మరాఠా రిజర్వేషన్ల కోటా కోసం ఉద్యమిస్తున్న మనోజ్ జరంగే పాటిల్ నాయకత్వంలో ఆగస్టు 29 నుంచి మహారాష్ట్రలో ఆందోళనను ఉదృతం చేశారు. ఆజాద్ మైదానంలో వేలాది మందితో పాటిల్ సభ నిర్వహించారు. కాగా మూడు రోజులుగా సెంట్రల్ ముంబై వంటి ప్రాంతాల్లో వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో కొంతమంది మరాఠా కోటా కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్ గేట్లు తోసుకొని ప్రధాన కార్యాలయంలోకి దూసుకొచ్చారు. అయితే వారిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడే నిలువరించారు. ఈ సందర్బంగా ఆందోళనకారులు మాట్లాడుతూ తాము కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో షేర్ హోల్డర్లమేనని పేర్కొన్నారు. తమ డబ్బు ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారని అన్నారు. అయితే, ‘మా ఉద్దేశం ఇక్కడ జరిగే ట్రేడింగ్‌కు భంగం కలిగించడం కాదు. అయితే మా న్యాయమైన వాటాను సాధించుకునేందుకు దేన్నైనా ప్రభావితం చేయగలం అని చెప్పడానికే ఇక్కడ నిరసన చేపట్టాం’ అని ఒక కార్యకర్త మీడియాకు చెప్పారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/modi-reiterates-fight-against-terrorism/

మెడలో కాషాయ కండువాలు ధరించి, తల మీద టోపీలు ధరించిన వ్యక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఒక్కసారిగా బీఎస్ఈ బిల్డింగ్‌వైపు దూసుకురావడం సోమవారం ఉదయం కలకలం రేపింది. వీళ్లంతా అజాద్ మైదానంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మరాఠా కోటా కార్యకర్తలు. మూడురోజులుగా ఇక్కడే నిరసనకు దిగిన పాటిల్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా మరాఠాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడే వంటలు చేసుకోవడానికి కావాల్సిన వంట సామగ్రి, ఆహార పదార్థాలు సిద్దం చేశారు.

పోలీసుల కుట్ర
ఈ సందర్భంగా ఉద్యమ నేత మనోజ్ జరంగే మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. పోలీసులే సివిల్ దుస్తుల్లో , కషాయ కండువాలు కప్పుకొని తమ పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం వార్నింగ్ ఇచ్చారు. ‘మా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో మరాఠా ఆగ్రహ జ్వాలలు చవి చూడాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

ట్రాఫిక్ మళ్లింపు

అజాద్ మైదాన్, మెరైన్ డ్రైవ్, బైకుల్ల, వదాల వంటి ప్రాంతాల్లో మరాఠాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ముంబై వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad