హర్యానాలో మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవటం తప్పనిసరి అంటూ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. కోవిడ్ మరో వేవ్ రాకుండా ముందుజాగ్రత్త చర్యల్లో ది ఓ కీలక చర్య అంటూ హర్యానా సర్కారు వివరిస్తోంది. దేశవ్యాప్తంగా అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో ఈమాత్రం చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం. కాగా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో కరోనా పట్ల అవగాహన, వ్యక్తిగతంగా పరిశుభ్రత అవసరం అని ప్రచార కార్యక్రమాలను కూడా సర్కారు ఉధృతంగా చేపడుతోంది.
100 మంది కంటే ఎక్కువ మంది ఉన్న అన్ని ఆఫీసులు, మాల్స్, ఫంక్షన్ హాల్స్, ఇతరత్రా పబ్లిక్ ప్లేసుల్లో మాస్కును ధరించాల్సిందేనంటూ మాస్కు తప్పనిసరి చేస్తూ హర్యానా ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. హర్యానాలోని గురుగ్రామ్ లో రోజూ కొత్తగా వందలాది కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.