గుజరాత్ రాష్ట్రంలో భారీ విస్పోటనం(Massive Blast) సంభవించింది. బనస్కాంత ప్రాంతంలోని ధున్వా రోడ్డులో ఉన్న బాణసంచా కర్మాగారం(Fireworks Factory)లో ఒక్కసారిగా పేలుడు ఏర్పడింది. ఆ పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా భవనం పైకప్పు కుప్పకూలింది. దీంతో కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.