ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 20మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఆయుధ సామాగ్రి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.