Homeనేషనల్Delhi: ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది సజీవ దహనం!

Delhi: ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది సజీవ దహనం!

Massive fire accident: దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాలవీయ నగర్‌లోని ఒక ప్రముఖ రెస్టరంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 30 మంది మంటల్లో చిక్కుకున్నారు. మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

- Advertisement -

రంగంలోకి రెస్క్యూ ఆపరేషన్: ప్రమాద సమయంలో రెస్టరంట్‌లో పెద్ద సంఖ్యలో జనం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందులో మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తూనే, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also read- Accident: ఘోర ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఏడుగురి మృతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News