Saturday, November 15, 2025
Homeనేషనల్Tamilnadu: డీజిల్ లోడ్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..?

Tamilnadu: డీజిల్ లోడ్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..?

Indian Railways: డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ఓ గూడ్స్‌ రైలులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఇళ్లల్లో ఉండే ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే తీవ్ర భయాందోళనలో స్థానికులు ఉన్నారు. తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

- Advertisement -

చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ కంపెనీ గూడ్స్ రైలులో డీజిల్ను తరలిస్తుంది. మొత్తం 52 వ్యాగన్లతో గూడ్స్ రైలు బయలుదేరింది. తిరువల్లూరు సమీపంలోకి రాగానే రైలుకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. వ్యాగన్లలో డీజిల్ ఉండటంతో మిగిలిన వ్యాగన్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: విడాకులు తీసుకున్న సంతోషంలో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం!

మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు సమీప ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. అలాగే ఇళ్లలోని సిలిండర్‌లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. రైలు పట్టాలు తప్పడంతోనే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రమాదంలో చెన్నై-అరక్కోణం రూట్‌లో రైళ్లను నిలిపివేశారు. వేరే రూట్లలోకి రైళ్లను మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad