Medical Shops Strike: మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్‌లైన్‌లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్‌కి ‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్’(AIOCD) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రేపు దాదాపు 12 లక్షలకి పైగా ఔషధాల దుకాణాలు మూతపడనున్నాయి.
Also Read: https://teluguprabha.net/technology-news/moto-g37-smartphones-launched/
బంద్‌కి కారణాలివే..
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను సరిగ్గా వెరిఫై చేయకుండానే యాంటీబయాటిక్స్, ఇతర తీవ్రమైన మందులను విక్రయిస్తున్నాయని కెమిస్ట్‌లు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇ-ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక, సాంప్రదాయ రిటైల్ మందుల దుకాణాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించే నకిలీ ప్రిస్క్రిప్షన్ల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-cabinet-meet-in-yadadri/
దేశవ్యాప్తంగా దాదాపు 12.4 లక్షలకు పైగా లోకల్ రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు ఈ బంద్‌లో పాల్గొంటాయని అసోసియేషన్ తెలిపింది. అయితే అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఫార్మసీలు, ఎమర్జెన్సీ మెడికల్ స్టోర్స్ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. బంద్ నేపథ్యంలో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా అవసరమయ్యే బీపీ, షుగర్ లేదా ఇతర అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసి ఉంచుకోవడం మంచిది.

