Ex-Meghalaya CM D D Lapang died: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ డోన్వా డెత్వెల్సన్ లాపాంగ్ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో.. శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. డీ డీ లాపాంగ్ నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1992-1993, 2003-2006, 2007-2008 మరియు 2009-2010లో ఆయన సీఎంగా ఉన్నారు. మొదట రోడ్ లేబర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన లాపాంగ్.. తర్వాతి కాలంలో పాఠశాలల సబ్-ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా నొంగ్‌పోహ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్య నేతగా ఎదిగారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: మేఘాలయ ప్రజలు లాపాంగ్‌ను మహేగా పిలుచుకునేవారు. మేఘాలయకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా.. 2024లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. లాపాంగ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. డాక్టర్ డి.డి. లాపాంగ్‌కు భార్య అమెథిస్ట్ లిండా జోన్స్ బ్లాతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణించే సమయంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు విన్సెంట్ హెచ్ పాలా ఆయనతోనే ఉన్నారు.
Also Read:https://teluguprabha.net/national-news/supreme-court-refuses-to-hear-kangana-ranauts-petition/
ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు: 1932 ఏప్రిల్ 10న జన్మించిన లాపాంగ్.. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నొంగ్‌పోహ్ నియోజకవర్గం నుంచి గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992 నుండి 2010 మధ్యకాలంలో ఆయన మేఘాలయ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు బాధ్యతలు నిర్వహించారు. లాపాంగ్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎపీపీ)లో చేరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా పనిచేశారు.


