Saturday, November 23, 2024
Homeనేషనల్మహా, జార్ఖండ్ లో ఉత్కంఠ… ఇప్పటివరకు ఆధిక్యం ఎవరిదంటే?

మహా, జార్ఖండ్ లో ఉత్కంఠ… ఇప్పటివరకు ఆధిక్యం ఎవరిదంటే?

మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (Jharkhand) ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. విజయం ఏ పార్టీని వరిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల రోజు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఎన్డీయే కూటమికే పట్టం కట్టాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగగా… మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది.

- Advertisement -

288 స్థానాలున్న మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ లేదా కూటమి 145 సీట్లు గెలవాలి. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీలో మెజారిటీ సంఖ్య 41 కాగా, ఈ రెండు రాష్ట్రాల్లోనూ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.

ఉపఎన్నికల ఫలితాలు కూడా నేడే…

మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాల్లోని మొత్తం 46 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని నాందేడ్ లో కాంగ్రెస్‌ ఎంపీ వసంతరావు బల్వంత్‌రావు చవాన్‌ మృతితో, వాయనాడ్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగాయి. వాయనాడ్‌లో ప్రియాంకా గాంధీ బరిలో నిలుచున్నారు.

మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే…

మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 కాగా, ఎన్డీయే కూటమి మహాయుతి 195 స్థానాల్లో ఆధిక్యం కనబరిచి మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటేసింది. కాంగ్రెస్ అలయన్స్ మహావికాస్ అఘాడి స్థానాల్లో 81 ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 41 కాగా… రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్డీయే కూటమి స్థానాల్లో ఆధిక్యంలో 38 ఉండగా, ఇండి కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు వాయనాడ్‌లో ప్రియాంకా గాంధీ 85 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News