Sunday, October 6, 2024
Homeనేషనల్Mid-day meal: మధ్యహ్న భోజనంలో చికెన్, పళ్లు..దీదీనా మజాకానా

Mid-day meal: మధ్యహ్న భోజనంలో చికెన్, పళ్లు..దీదీనా మజాకానా

పశ్చిమబెంగాల్ స్కూళ్లలో ఇకమీదట మధ్యహ్న భోజనంలో చికెన్, పళ్లు కూడా ఇవ్వనున్నారు. జనవరి నుంచి 4 నెలలపాటు సీజనల్ పళ్లతోపాటు మాంసాహారం వడ్డించాలని దీదీ సర్కారు డిసైడ్ అయింది. పిల్లలకు అదనంగా పోషకాలు అందేందుకు ఇలా మిడ్డే మీల్ మెనూ మార్చుతున్నట్టు సర్కారు బాకా ఊదుతోంది. పీఎం పోషణ్ అనే స్కీములో భాగంగా ఇదంతా జరుగనుంది. ఇందుకోసం అదనంగా 371 కోట్ల రూపాయల నిధులను మమతా బెనర్జీ సర్కారు ఆమోదించిందికూడా. మధ్యహ్న భోజన పథకంలో భాగంగా కేవలం అన్నం, పప్పు, కూరగాయలు, సోయాబీన్, గుడ్లు మాత్రమే అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం బెంగాల్ లో 1.16 కోట్ల మంది పిల్లలు సర్కారీ బళ్లలో చదువుకుంటున్నారు. 60:40 నిష్పత్తిలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యహ్న భోజన పథకానికి నిధులు సమకూర్చుతున్నాయి. ఈ ఏడాదిలో పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో దీదీ ఈ భారీ వ్యూహం రచించిందని ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంటోంది. పిల్లల పౌష్టికాహారంపై అంత చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికలే లక్ష్యం కాకపోతే ఇంతకాలం టీఎంసీ సర్కారు ఈమేరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికార తృణముల్ ను బీజేపీ కడిగిపడేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News