కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025లో యుద్ధ విమానాన్ని నడిపారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారయిన HAL స్వదేశంలో తయారు చేసిన HJT-36 యశస్‌ను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నడిపారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/250ed4f3fd3ae49984723938eeb7314e.jpg)
స్వదేశంలో సగర్వంగా తయారైన HJT-36 యశస్ జెట్ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. పైలట్ రామ్ కలిసి ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని సోషల్ మీడియా పోస్టు చేశారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/e2bcd8c56dbf0ddc07eda18fb3e81ccb.jpg)
ఈ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ తయారు చేసింది. ఇలాంటి అరుదైన అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పట్టు సాధిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని.. ఆయన ట్వీట్ చేశారు.