MK Stalin Takes A Dig At PM Modi Over Russian Oil: ప్రధాని నరేంద్ర మోదీకి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మధ్య ‘రష్యా చమురు’ విషయంలో మాటల యుద్ధం మొదలైంది. ఒకవైపు గుజరాత్ రిఫైనరీల కోసం కేంద్రం రష్యా నుంచి రాయితీ చమురు కొనుగోలు చేస్తోందని, కానీ మరోవైపు అదే కారణంగా అమెరికా విధించిన సుంకాలతో వేలాది మంది కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నా పట్టించుకోవడం లేదని స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న స్టాలిన్.. ‘విశ్వగురు’ బిరుదుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ALSO READ: Trump on India Tariffs: భారత్‌ది ఏకపక్ష ప్రేమే.. అత్యధిక సుంకాలతో మమ్మల్ని ముంచేసింది!
అమెరికా సుంకాలతో తిరుప్పూర్‌కు రూ.3 వేల కోట్ల నష్టం
మరోవైపు, తిరుప్పూర్‌లోని లక్షలాది మంది కార్మికులు, ఎగుమతిదారులు అమెరికా ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలను శిక్షించడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా దేశంలోని అత్యంత పెద్ద వస్త్ర కేంద్రమైన తిరుప్పూర్ పరిశ్రమ ఇప్పటికే రూ.3 వేల కోట్లు నష్టపోయింది. కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ మోదీపై విమర్శల దాడిని ఎక్కుపెట్టారు.
ఎక్స్ వేదికగా స్టాలిన్ పదునైన పోస్ట్
తిరుప్పూర్‌లోని ఆందోళనకారులకు మద్దతుగా స్టాలిన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తమిళంలో ఒక పోస్ట్ చేశారు. “రాయితీతో చమురు కోసం, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్న మన ఎగుమతిదారులను కష్టాల్లోకి నెట్టడం మీకు ఎలా సబబు? తక్షణమే సహాయం ప్రకటించి, అమెరికాతో చర్చలు జరిపి మీ విశ్వగురు బిరుదుకు తగినట్లుగా నిరూపించుకోండి” అని మోదీని డిమాండ్ చేశారు.
ALSO READ: India-Russia Oil Deal: అమెరికా ఆంక్షల వేళ భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్
అయితే, స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్టాలిన్ వ్యాఖ్యలు “అపరిపక్వమైనవి” అని పేర్కొన్న బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతి, “ఒక ముఖ్యమంత్రికి ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు రెండూ అర్థం కాకపోవడం ఆశ్చర్యకరం” అని తిప్పి కొట్టారు.
నిపుణుల హెచ్చరిక
ఈ రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య నిజమైన ప్రమాదం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ నేరుగా జోక్యం చేసుకుని వాషింగ్టన్‌తో సంప్రదించకపోతే తిరుప్పూర్ లాంటి భారతీయ ఎగుమతి కేంద్రాలకు శాశ్వత నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Shehbaz Sharif : భారత్-రష్యా సంబంధాలు అద్భుతం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్


