HomeTop StoriesM.K Stalin: ‘కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలి’

M.K Stalin: ‘కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలి’

MK Stalin Post: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకి టీవీకే అధినేత విజయ్‌కి అన్ని చిక్కులు తొలగిపోయాయి. గవర్నర్‌ ఆమోదంతో విజయ్‌ సీఎంగా త్వరలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంటూ పోస్ట్‌ చేశారు. కాగా, తమతో ఇప్పటివరకూ కలిసి పనిచేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు దారి మార్చి అవకాశవాదిగా మారిందని విమర్శించారు. 

- Advertisement -

ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయని స్టాలిన్‌ అన్నారు. అయితే తన ఆధ్వర్యంలోని డీఎంకే గణనీయమైన సీట్లు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు తమిళ ప్రజలకు, తనతో నడిచిన కీలక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుపడబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు. అందుకే మిత్రపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా.. వారి నిర్ణయాన్ని గౌరవించి సమన్వయంతో వ్యవహరించినట్లు చెప్పారు. 

Also Read: https://teluguprabha.net/national-news/vck-officially-supports-tvk-to-form-government/

అయితే డీఎంకే కూటమి తరఫున పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి అన్నా అరివాలయానికి రాలేదని స్టాలిన్‌ ఆరోపించారు. అందుకే అదే రోజు, కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో సంబంధాలను తెంచుకుందన్నారు. అదే సమయంలో, వామపక్ష, వీసీకే ఎమ్మెల్యేలు.. తాము డీఎంకేతో చేతులు కలిపి తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించి డీఎంకేపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించారని కొనియాడారు.

డీఎంకే ప్రభుత్వంలో తమిళనాడును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని సుసంపన్నం చేశామని స్టాలిన్‌ అన్నారు. అనేక పథకాల ద్వారా, ప్రతి వ్యక్తి లబ్ధి పొందేందుకు అవకాశాలను కల్పించామని.. దూరదృష్టితో, పటిష్ఠమైన ప్రణాళికతో రూపొందించిన ఆ పథకాలను, ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. మహిళలు, యువత, విద్యార్థులు, పిల్లలు, అణగారిన వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులను కలుపుకొని ఉన్న అన్ని పథకాలను అమలు చేయడం కొనసాగిస్తే, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/minister-tummala-nageswara-rao-held-a-review-with-officials-on-crop-rotation/

మరోవైపు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సంఖ్యాబలానికి వీసీకే మద్దతు తెలపడంతో రాజకీయ ఉత్కంఠకి తెరపడింది. అయితే గవర్నర్‌ ఆమోదంతో విజయ్‌ ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంది. టీవీకే మ్యాజిక్‌ ఫిగర్‌(118)తో సిద్ధంగా ఉంది. ఈ మేరకు టీవీకే భవన్‌ నుంచి విజయ్‌ లోక్‌భవన్‌కు బయలుదేరారు. గవర్నర్‌కి మద్దతు లేఖలు అందజేసి.. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని కోరనున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News