Sunday, October 6, 2024
Homeనేషనల్Modi and Revanth in Adilabad: ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్

Modi and Revanth in Adilabad: ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్

కేంద్రంతో తగాదా పెట్టుకోం, తేల్చి చెప్పిన రేవంత్

ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నామని రేవంత్ ప్రసంగించటం అందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -

విభజన హామీ మేరకు NTPC 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామన్నారని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయన్నారు సీఎం. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదన్న ఆయన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదని.. సహృద్భావ వాతావరణం ఉండాలన్నారు.

అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశామని చెప్పిన సీఎం రేవంత్.. స్కై వేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల మా ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరుతున్నామని, సెమీ కండక్టర్ ఇండస్ర్టీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని తేల్చి చెప్పిన రేవంత్, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే మా విధానమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానిని కోరుతున్నా అంటూ రేవంత్ ప్రసంగించటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News