NEET controversy: నీట్ పేపర్‌లీకేజీ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో సృష్టించిన అల్లకల్లోలం గురించి అందరికీ తెలిసిందే. వారు చేపట్టిన నిరసనలు..తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల డిమాండ్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడంతో విద్యార్థులు కాస్తా శాంతించారు. ఈ క్రమంలో పార్లమెంట్ ముట్టుడికి విద్యార్థులు పిలుపునిచ్చిన సమయంలో విద్యార్థుల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.దాంతో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీని తిడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారి పై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడి విడుదల చేశారు.మరణించిన తన తల్లిని దూషించిన విద్యార్థుల పై తనకు ఎలాంటి కక్ష లేదని , వారందరిని కూడా క్షమిస్తున్నట్లు ఆ వీడియో లో మోదీ తెలిపారు. అయితే ఈ వీడియోపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడారు.
కేసులను కూడా వెనక్కి…
మోదీ కేవలం సోషల్ మీడియా రీల్‌లో మాత్రమే దూషించిన విద్యార్థుల్ని క్షమిస్తారా లేక వారిపై నమోదైన కేసులను కూడా వెనక్కి తీసుకుంటారా అంటూ ఆయన అడిగారు.మోదీ విడుదల చేసిన వీడియోలో తిట్లు..దూషణలు సమస్యలకు పరిష్కారం చూపవు. యువతను కోర్టుల చుట్టూ తిప్పడం,వారిని వేధించడం లాంటివి చేయడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం మంచిందంటూ ప్రస్తావించారు.
అయితే.. దీనిపై స్పందించిన అభిజీత్ క్షమాపణ అనేది కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను కూడా వెనక్కి తీసుకోని చేతల ద్వారా చూపించాలంటూ డిమాండ్ చేశారు.
Also Read:Price Hike: బ్యాడ్ న్యూస్…నేటి నుంచి భారీగా పెరుగుతున్న వీటి ధరలు!

