త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన ప్రసంగంతో త్రిపుర వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. త్రిపురలో కాంగ్రెస్-సీపీఐ(ఎం) కూటమిని ఉద్దేశించి.. కేరళలో కుస్తీ, త్రిపురలో దోస్తీ అన్నట్టు కాంగ్రెస్-కమ్యూనిస్టుల వ్యవహార శైలి ఉందంటూ విమర్శించారు. బీజేపీకి కాకుండా రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఓటు వేసినా రాష్ట్రం చాలా ఏళ్లు అభివృద్ధిలో వెనక్కి పోతుందంటూ మోడీ పేర్కొన్నారు. గిరిజనుల్లో చీలిక తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అంటూ మోడీ ఆరోపించారు. లెఫ్ట్ పాలనలో ఉన్న ఓ రాష్ట్రంలో కరోనా సమయంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని అదే త్రిపురలో బీజేపీ తీసుకున్న చర్యలతో అలాంటి ఇబ్బందులు తలెత్తలేదని మోడీ చెప్పారు.