Narendra Modi : మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తమిళ భాషపై మలేషియా ప్రజలకు ఉన్న మక్కువ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని ఆయన కొనియాడారు.
Apple AI Pin: డిస్ప్లే లేకుండానే ఐఫోన్? అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్
ముఖ్యంగా మలేషియాలోని విద్య, మీడియా , సాంస్కృతిక రంగాలలో తమిళ భాషా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన గుర్తుచేశారు. భారత్ , మలేషియాల మధ్య కుదిరిన ‘ఆడియో విజువల్ ఒప్పందం’ (Audio Visual Agreement) ద్వారా చలనచిత్రాలు , సంగీతం, ముఖ్యంగా తమిళ సినిమాలు రెండు దేశాల ప్రజల హృదయాలను మరింత దగ్గర చేస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
సాంస్కృతిక బంధం , చరిత్ర
మలేషియాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భారతీయ సంతతి జనాభా ఉందని, శతాబ్దాలుగా వారు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని మోదీ ప్రశంసించారు. మలేషియాలో తిరువళ్లువర్, స్వామి వివేకానంద వంటి మహనీయుల ప్రభావం కనిపిస్తుందని, అక్కడ సుమారు 500 పాఠశాలల్లో భారతీయ భాషల్లో విద్యాబోధన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బాటు కేవ్స్‌లో జరిగే థైపూసం వేడుకలు తమిళనాడులోని పళని వేడుకలకు ఏమాత్రం తీసిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు తమిళ భాషపై ఉన్న గౌరవాన్ని, ముఖ్యంగా దివంగత ఎంజీఆర్ పాటల పట్ల ఆయనకున్న ఇష్టాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
తమిళ భాష ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి అని, తమిళ సాహిత్యం శాశ్వతమైనదని మోదీ పేర్కొన్నారు. ఈ చారిత్రక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మలేషియా విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘తిరువళ్లువర్ చైర్’తో పాటు, ఇప్పుడు కొత్తగా ఒక ‘తిరువళ్లువర్ కేంద్రాన్ని’ (Thiruvalluvar Centre) కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్ నుంచి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మంత్రులు ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్. మురుగన్ వంటి ప్రముఖులు తమిళనాడుకు చెందిన వారేనని ఆయన సభలో గుర్తుచేశారు.
Yellamma: ఎల్లమ్మకు మరో అడ్డంకి – షూటింగ్ ఇప్పట్లో లేదట – కారణం ఇదే!

