India China cooperation: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలను సుంకాలతో బయపెట్టి తన దారికి తెచ్చుకోవాలని చూస్తుంటే.. భారత ప్రధాని మోదీ తలొగ్గేది లేదంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. శత్రువును ఎప్పుడు మిత్రుడిగా మార్చుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తూ ఇండియా అంటే ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో భారత్-చైనాల మధ్య వాణిజ్య సహకారం కీలకమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న అస్థిరత సందర్భంలో, రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి స్థిరత్వాన్ని తీసుకురావాలని మోదీ సూచించారు. ప్రపంచ ఆర్థిక అస్థిరత వేళలో భారత్-చైనా కలసి ముందుకు సాగితే మాత్రమే శాంతి, అభివృద్ధి, స్థిరమైన అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ గట్టిగా నమ్ముతున్నారు.
జపాన్ పత్రిక యోమియూరి షింబున్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. “ప్రస్తుత అశాంతి పరిస్థితుల్లో పెద్ద దేశాలైన భారత్, చైనా కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శాంతి, స్థిరత్వం తీసుకురావడం ఎంతో అవసరం” అని అన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపరచడం ఎంత ముఖ్యమని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు మోదీ.
Chandrababu :పద్దతి మార్చుకోండి..ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మాస్ వార్నింగ్
చైనా ఇండియాలు పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక దృష్టిలో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక సంభాషణను పెంచుతామని స్పష్టం చేయటం అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని చెప్పినట్లు అయ్యింది.
ప్రస్తుతం మోదీ జపాన్‌లో జరుగుతున్న 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ ప్రయాణం అనంతరం ఆయన చైనా వెళ్లి టియాంజిన్‌లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ప్రధానమైన ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. మోదీ వ్యూహం ప్రస్తుత సమయంలో చాలా కీలకమైనదని, ఇది భారత వృద్ధి పరుగులను కొనసాగించేందుకు దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.


