మోడీ వరంగల్ పర్యటన ముగిసింది. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. విజయ సంకల్ప సభ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వేదికపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మోడీ ఆరోపణలు గుప్పించారు. హనుమకొండలో 6,109 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని 521 కోట్ల రైతు వ్యాగన్ల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.
ఎప్పట్లాగే తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ, సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమలను తన ప్రసంగంలో గుర్తుచేశారు. కేసీఆర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం అన్న ఆయన, కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ఆరోపించటం విశేషం. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయటం ఏంటని మోడీ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణం ద్వారా యువతను మోసం చేసిందని, సర్పంచ్ లు సైతం కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతు చేస్తామని మోడీ తన ప్రసంగంలో హెచ్చరించారు.
అంతకుముందు వరంగల్ భద్రకాళి అమ్మవారిని మోడీ దర్శనం చేసుకున్నారు.