Friday, November 22, 2024
Homeనేషనల్Modi: ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్.. ఇండియాలోనే ఫారిన్ యూనివర్సిటీలు

Modi: ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్.. ఇండియాలోనే ఫారిన్ యూనివర్సిటీలు

విదేశాలకు వెళ్లి అక్కడి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుకోవాలంటే అక్కడికే వెళ్లాల్సిన పని లేకుండా మనదేశంలోనే ఆ క్యాంపస్ లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ..ఆక్స్ ఫర్డ్, స్టాన్ఫోర్డ్, యేల్ యూనివర్సిటీలు ఇండియాలోనే క్యాంపస్ లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది. ఈ మేరకు ఓ డ్రాఫ్ట్ ను యూజీసీ రూపొందించి పార్లమెంట్ ఆమోదానికి త్వరలో పంపనుంది కూడా. ఈ విశ్వవిద్యాలయాలు తామే సొంతంగా బోధనా సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమించుకునేలా వారికి అటానమస్ పవర్స్ ఇచ్చేలా యూజీసీ యోచిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలను భారతీయ విద్యార్థులు స్వదేశంలోనే అందుకునేలా మోడీ సర్కారు ఈమేరకు సరికొత్త ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఇలాంటి చర్యలతో భవిష్యత్తులో మనదేశం గ్లోబల్ స్టడీ డెస్టినేషన్ గా మారటం ఖాయం. తాజా నిర్ణయంతో విదేశీ యూనివర్సిటీలు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం లేకుండానే సొంతంగా ఇండియన్ బ్రాంచ్ ను ప్రారంభించవచ్చు. 2022 గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ ప్రకారం 133 దేశాల మధ్య మనదేశం 101 ర్యాకులో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News