Money Bags Thrown During ED Raids: ఈడీ సోదాలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో ఈడీ రైడ్స్ జరుగుతుండగా.. ఆ భవనం పైనుంచి నోట్ల కట్టలతో కూడిన సంచులు విసిరివేయడం కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేటి (గురువారం) ఉదయం సోదాలు నిర్వహించారు. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణల కేసుల్లో భాగంగా ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్స్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్‌స్ట్రక్షన్స్ సహా అనుబంధ సంస్థలకు చెందిన ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరిపింది. అయితే, మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా.. కొందరు నోట్ల కట్టలతో నిండిన సంచులను పై అంతస్తు నుంచి బయటికి విసిరివేశారు. వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. నేలపై నోట్ల కట్టలు పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంత భారీ ఎత్తున నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నగదుకు భూ కుంభకోణం కేసుతో సంబంధం ఉందా? అనే అంశంపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, నగదు సంచులు దొరికినట్లు ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆ వీడియోలను ఎస్ఏడీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. ఈడీ దాడుల సందర్భంగా నగదును ఇలా పడేశారంటూ ఆయన పోస్టులో పేర్కొనడం సంచలనంగా మారింది.
Major Breaking
👉 Crores of Money, 500 notes flying in Air. Money Belongs to whom— OSD CM Mann Rajbir' Singh
👉 "Kattar Fraudsters" in ED trap
👉ED raids on CM Bhagwant Mann’s close aide OSD Rajbir' Ghumman's close aides and relatives Nitin, Veer davinder.
👉ED raids Mohali… pic.twitter.com/iZGBa5iixO— Bikram Singh Majithia (@bsmajithia) May 7, 2026
నితిన్ గోహల్ కోసం ఈడీ గాలింపు..
మరోవైపు, నితిన్ గోహల్ అనే వ్యక్తి కోసం ఈడీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(GMADA)కి ఫీజులు చెల్లించని బిల్డర్లకు గోహల్ రాజకీయ రక్షణ కల్పించాడని ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓఎస్డీ రాజ్‌బీర్ ఘుమన్‌తో గోహల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతనిపై జీఎంఏడీఏ నుంచి భూ వినియోగ మార్పు లైసెన్సులు పొందడంలో మోసానికి పాల్పడడం, పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల నిధులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/national-news/congress-calls-for-protests-in-tamil-nadu/

