Central Govt Employees: 8వ వేతన సంఘం గురించి క్రేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలు అవుతుండగా.. ఇది ఈ ఏడాదితో ముగియనుంది. అయినప్పటికీ.. జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువ అని ఆర్థిక నిపుణులు అంచనా వెస్తున్నారు. ఏకంగా 3 సంవత్సరాల వరకు సమయం పడుతుందని అంటున్నారు. అయితే మరికొంత మంది 8వ వేతన సంఘం అంశంపై త్వరలో కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. దీపావళి నాటికి 8వ పే కమిషన్ విషయంలో కీలక వార్త వినిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ముఖ్యంగా 8వ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఛైర్మన్ ఎంపిక అలాగే ఇతర సభ్యుల నియామకంలో ఆలస్యం చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి 8వపే కమిషన్ కు సంబంధించిన కీలక ప్రకటన జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడంలేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆందళోనలో ఉన్నారు. అయితే కేంద్రం ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 20వ తేదీలోగా దీపావళి పండుగ సందర్భంగా 8వ పే కమిషన్ ఛైర్మన్‌తో పాటుగా ఇతర సభ్యుల నియామకం జరిపే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇదే విషయంలో ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారం గమనించినట్లయితే 8వ వేతన కమిషన్ 2026 ప్రారంభం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఎందుకంటే 2025 డిసెంబర్ 31 నాటికి 7వ వేతన కమిషన్ సిఫార్సులు ముగుస్తాయి. ఈలోగా 8వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు చర్యలేవి కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. అందుకే ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులు 2026 జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావడం దాదాపు అసాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అధ్యయనంతో పాటు సిఫార్సులు కేంద్రాకి అందజేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో కూడా 7వ వేతన కమిషన్ అమలు పక్రియలో ఇదే విధంగా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి.. కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.


