Sunday, November 24, 2024
Homeనేషనల్Funny Video : మ‌మ్మీ.. నీ క‌బుర్లు త‌రువాత ముందు పాల సీసా ఎక్క‌డ పెట్టావో...

Funny Video : మ‌మ్మీ.. నీ క‌బుర్లు త‌రువాత ముందు పాల సీసా ఎక్క‌డ పెట్టావో చూడు

Funny Video : ముచ్చ‌ట్లు ఉంటే చాలు ఇంకా ఏం అక్క‌ర‌లేదు చాలా మందికి. వాళ్లు అలాంటి వాళ్లు, వీళ్లు ఇలాంటి వాళ్లు అంటూ క‌బుర్ల‌లో మునిగిపోతారు. పొయ్యి మీద పాలు పొంగుతున్నా, కూర మాడిపోతున్నా, పిల్లాడు ఏడుస్తున్నా ప‌ట్టించుకోరు. వారి ముచ్చ‌ట్లు వారివే. స‌రిగ్గా ఇలాగే ఓ మాతృమూర్తి ప‌క్క‌నున్న వారితో ముచ్చ‌ట్లు పెట్ట‌డం ప్రారంభించింది ఒడిలో ఉన్న చిన్నారి పాలు తాగుతున్నాడు అన్న సంగ‌తి మ‌రిచిపోయిన‌ట్లు ఉంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

ఆ వీడియోలో ఏం ఉందంటే.. అది హోట‌లో లేక బ‌స్టాండో లేఖ కార్యాల‌యంలో తెలీదు గానీ. ఓ మ‌హిళ త‌న చిన్నారిని ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఆ చిన్నారికి పాల సీసాతో పాలు తాపుతోంది. ఇంత‌లో ఆమెను ఎవ‌రో ప‌ల‌క‌రించారు. ఇక అంతే ఆమె వారితో ముచ్చ‌ట్ల‌లో మునిగిపోయింది. ఎంత‌లా అంటే పాల సీసా చిన్నారి నోట్లో పెట్టకుండా చెవిలో పెట్టేంత‌గా.

చిన్నారి పాలు తాగుతున్నాడా..? లేదా విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఆ వాడే తాగుతాడు అనుకున్న‌దో ఏమో తెలీదు గానీ క‌నీసం చిన్నారి వైపు చూడ‌ను కూడా చూడ‌కుండా ప‌క్క‌వారితో ముచ్చ‌ట్ల‌లో మునిగిపోయింది. ఈ త‌తాంగాన్ని మొత్తం ఆమెకు ఎదురుగా కూర్చున వారు వీడియో తీశారు. ఆ వీడియో ఆఖ‌ర్లో త‌న త‌ప్పును గ‌మ‌నించిన ఆమె సిగ్గుప‌డి న‌వ్వుకుంది. త‌రువాత పిల్లాడి నోటికి పాల సీసాను అందించింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుత‌న్నారు. అంత సోయి లేకుండా అలా ఎలా క‌బుర్ల‌ల‌లో ముగినిపోయావు అని ఒక‌రు కామెంట్ చేయ‌గా, కొద్ది సేప‌టి త‌రువాత అయినా త‌ప్పును గుర్తించావు సంతోషం అంటూ ఇంకొక‌రు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News