Nalgonda: ఈ మధ్యకాలంలో ప్రియుడి కోసం భర్తలను హతమారుస్తున్నారు. కన్న పిల్లలను సైతం కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఒక వార్తని మరువకముందే మరొక వార్త వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం నల్గొండ వెళ్ళింది. తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకువెళ్ళింది.
నల్గొండ ప్రయాణ ప్రాంగణంలో ప్రియుడి కోసం ఎదురుచూస్తూ.. ప్రియుడు రాగానే కొడుకుని అక్కడే వదిలిపెట్టేసి ప్రియుడి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ఇది అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అక్కడే ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తూ ఉన్న చిన్నారిని అక్కడి ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
Readmore: https://teluguprabha.net/national-news/child-kills-snake-with-bite/
పోలీసులు ప్రయాణ ప్రాంగణంలోని సీసీ కెమెరాలు చూడగా అందులో రికార్డు అయినా దృశ్యాలను బట్టి ఆ మహిళను గుర్తించారు. ఆ తరువాత మహిళను విచారించగా.. ఆ మహిళకు ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అతన్ని కలవడానికి నల్గొండ వెళ్ళింది. ఆటంకంగా ఉన్న చిన్నారిని ప్రయాణ ప్రాగణంలో వదిలేసి వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది.
విచారణ అనతంరం ఆ మహిళ భర్తకు సమాచారమివ్వగా.. మహిళ భర్త రాగానే పోలీసులు అతనికి చిన్నారిని అప్పగించారు. మానవత్వాన్ని కలిచివేసే ఈ ఘటన ఆర్టీసీ సిబ్బందిని, ప్రయాణికులతో పాటు పోలీసులకు కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు.


