ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గురువారం కాంగ్రెస్, బిజెపి ఎంపీలు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఈ పోటా పోటీ నిరసనల్లో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు అయ్యాయి. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, కేవలం షో కోసం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నిరసన చేసిందని, కాంగ్రెస్ ఎంపీ ల వ్యవహారశైలీని అందరూ గమనిస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ ను బుధవారం లోక్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచేవిధంగా మాట్లాడాడని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు పార్లమెంట్ ఆవరణలో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ ల నిరసన ర్యాలీ కి వ్యతిరేకంగా బిజెపి ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన ర్యాలీ చేశారు. పోటా పోటీ నిరసన ర్యాలీలో ఇద్దరు బిజెపి ఎంపీలకు బలమైన గాయాలు తగిలాయి.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగీ తలకు బలమైన గాయం, మరో బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్ పుత్ కు కూడా గాయాలు కావడంతో వారికీ వెంటనే నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించి ప్రధమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఇద్దరు బీజేపీ ఎంపీలను ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఎంపీ డాక్టర్ శబరి స్పందించిన తీరును పలువురు ఎంపీలు అభినందించారు.
MP Dr. Byreddy Sabari did first aid in Parliament: తోటి ఎంపీకు ఫస్ట్ ఎయిడ్ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నయా ఫైర్ బ్రాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES