HomeTop StoriesLok Sabha: రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ హైజాక్ చేస్తోంది.. కేసీ వేణుగోపాల్ ఫైర్‌!

Lok Sabha: రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ హైజాక్ చేస్తోంది.. కేసీ వేణుగోపాల్ ఫైర్‌!

MP KC Venugopal: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజ్యాంగ నిబంధనలను మార్చడం ద్వారా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

- Advertisement -

అంతరార్థం వేరే ఉంది: లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చర్చకు ముందు కేసీ వేణుగోపాల్ సభలో ప్రసంగించారు. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ప్రభుత్వం చెబుతున్న కారణం కాకుండా.. అంతరార్థం వేరే ఉందని ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి రక్షణగా ఉన్న నిబంధనలను మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

Also read-Lok Sabha: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చర్చకు లైన్ క్లియర్

మహిళా రిజర్వేషన్లపై ప్రశ్నలు: 2023లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. అయితే 2024 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను 2024 నుంచే అమలు చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News