ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ మరోసారి తాతయ్యారు. ఆయన కూతురు ఈశా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. ఈ మేరకు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. మా పాప ఈశా అంబానీ నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చింది. పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టారు.
- Advertisement -
ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం పేర్కొంది. కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటోంది.