Prateek Yadav passes away: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వ్యాపార రంగంలో స్థిరపడిన ప్రతీక్: సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ప్రతీక్ సోదరుడు (సవతి తల్లి కుమారుడు). ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధ్నా సింగ్ కుమారుడు. ఆయన భార్య అపర్ణ యాదవ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలిగా కొనసాగుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో స్థిరపడిన ప్రతీక్ యాదవ్ మరణవార్త విని యాదవ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

