Friday, April 4, 2025
Homeనేషనల్EV Store | ఈవీ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. యువతి మృతి

EV Store | ఈవీ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. యువతి మృతి

బెంగ‌ళూరులో ఎలక్ట్రిక్ వెహికిల్స్ స్టోర్ (EV Store) లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళా సిబ్బంది మృతి చెందింది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే…

- Advertisement -

మంగళవారం సాయంత్రం బెంగళూరులోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్‌లో అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. MY EV ఎలక్ట్రిక్ వెహికిల్స్ స్టోర్ (EV Store) లో సాయంత్రం 5.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టోర్ లోపల ఎలక్ట్రిక్ స్కూటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో షో రూమ్ లో పని చేస్తున్న 20 ఏళ్ల యువతి కాలి బూడిదైంది. అలాగే, 45 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమయ్యాయి.

బాధితురాలు షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రియగా అధికారులు గుర్తించారు. ఐదుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే లోపల చిక్కుకుపోయిన ప్రియ సకాలంలో బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News