N.S. Raja Subramani : భారత రక్షణ విభాగంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీడీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు: లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి నూతన సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించడంతో పాటు.. భారత సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు.
Also read-Tamil Nadu: తమిళనాడు సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ.. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
నావల్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్: మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ఆయన మే 31న బాధ్యతలు చేపడతారు. డిసెంబర్ 31, 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్‌గా సేవలందిస్తున్నారు. భారత త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ నూతన నియామకాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

