Saturday, November 15, 2025
Homeనేషనల్Lokesh PM Modi : దిల్లీలో ప్రధాని మోదీతో నారా లోకేశ్ భేటీ.. ఏపీ అభివృద్ధిపై...

Lokesh PM Modi : దిల్లీలో ప్రధాని మోదీతో నారా లోకేశ్ భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

Lokesh PM Modi : ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్ దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 45 నిమిషాల పాటు జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ భేటీ తర్వాత లోకేశ్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

- Advertisement -

ALSO READ: Akhanda 2: త‌మ‌న్ వ‌ల్లే ఆల‌స్యం – అఖండ 2 రిలీజ్‌పై బాల‌కృష్ణ కామెంట్స్ వైర‌ల్…

ఈ ఏడాది మే 17న లోకేశ్ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో కలిసి ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో లోకేశ్ నడిచిన 3,132 కి.మీ. యువగళం పాదయాత్రను వివరించే కాఫీ టేబుల్ బుక్ ‘యువగళం’ను ప్రధాని ఆవిష్కరించారు. నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

లోకేశ్ ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, విశాఖపట్నంలో డేటా సెంటర్ హబ్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన జీఎస్టీ సంస్కరణలను లోకేశ్ ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రిగా, పాఠశాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపును స్వాగతించారు. ఈ సంస్కరణలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు.

వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాంకేతిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం కోరినట్లు సమాచారం. లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ భేటీ గురించి పోస్ట్ చేస్తూ, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం నుంచి నిరంతర మద్దతు అందుతోందని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భేటీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి, ఎన్డీఏ కూటమికి రాజకీయంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. లోకేశ్ ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ చర్చలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపును తీసుకొస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad