Friday, March 28, 2025
Homeనేషనల్Farmers protest: ఈ నెల 28న రైతుల దేశవ్యాప్త నిరసనలు

Farmers protest: ఈ నెల 28న రైతుల దేశవ్యాప్త నిరసనలు

డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు (Farmers protest) చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.

- Advertisement -

సమస్యల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్‌ పోలీసులు అణచివేత విధానాన్ని అవలంబించారని ఎస్‌కేఎం ఆరోపించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కిసాన్‌ మోర్చా, ఎస్‌కేఎం (రాజకీయేతర) తదితర రైతు సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి అణచివేతపై పోరాటానికి దిగాలని విజ్ఞప్తి చేసింది.

భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు నేతలు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌తో పాటు 350 మందిని అరెస్ట్‌ చేసిందని ఆరోపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News