Friday, December 12, 2025
Homeనేషనల్Breaking: ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం..!

Breaking: ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం..!

Vice President Elections: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

- Advertisement -

ఎన్నికల ప్రక్రియ: పార్లమెంటు కొత్త భవనంలోని ‘ఎఫ్‌-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిగింది.

ఓటింగ్ వివరాలు: ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 781 మంది పార్లమెంటు సభ్యులకు గాను 768 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత రాష్ట్ర సమితి (BRS), బీజేడీ (BJD), శిరోమణి అకాలీ దళ్ (SAD) సభ్యులు ఓటు వేయలేదు.

అభ్యర్థుల బలం: అధికార ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉండగా, విపక్షాల ‘ఇండియా’ కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కూడా ఎన్డీఏకు మద్దతు తెలపడంతో రాధాకృష్ణన్ విజయం ఖాయమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News