Saturday, November 15, 2025
HomeTop StoriesNDA Manifesto: బీహార్‌లో ఎన్డీఏ మానిఫెస్టో విడుదల.. కోటి ఉద్యోగాలు, మెగా లెర్నింగ్‌ సెంటర్లు.. ఇంకా...

NDA Manifesto: బీహార్‌లో ఎన్డీఏ మానిఫెస్టో విడుదల.. కోటి ఉద్యోగాలు, మెగా లెర్నింగ్‌ సెంటర్లు.. ఇంకా మరెన్నో..!

NDA releases manifesto promises 1 crore government job: బీహార్‌ దంగల్‌కు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓటింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ జోరుగా హామీలను గుప్తిస్తున్నాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధికార జేడీయూ భాగస్వామ్యంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ మ్యానిఫెస్టోను కూటమిలోని అన్ని సీనియర్ నాయకుల సమక్షంలో విడుదల చేశారు. బీహార్ ఆర్థిక మంత్రి సామ్రాట్ చౌదరి ఈ మ్యానిఫెస్టోలోని అంశాలను మీడియాకు వివరించారు. రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు.. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్‌ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రాగానే, ప్రతి జిల్లాలో 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్యాక్టరీలు, 100 ఎంఎస్ఎంఈ పార్కులు, 50,000 కొత్త కుటీర పరిశ్రమలు ప్రారంభిస్తామని తెలిపింది. చిప్‌సెట్, సెమీకండక్టర్, మాన్యుఫాక్చరింగ్ పార్కుల ద్వారా ఐటీ, టెక్ రంగాలను బలోపేతం చేసేలా ప్లాన్ ఉంది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, స్కిల్ డెవలప్‌మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ, ‘మేడ్ ఇన్ బీహార్’ స్కీమ్ ద్వారా వ్యవసాయ ఎగుమతులను రెట్టింపు చేస్తామని తెలిపారు. కాగా, ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) వ్యవస్థాపకుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, లోక్ జనశక్తి పార్ట్ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, జనతాదళ్ (యునైటెడ్) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/minister-tummala-announces-rs-10000-per-acre-compensation-for-crop-losses/

ఇండియా కూటమి ఇంటికో ఉద్యోగం హామీ..

అంతకుముందు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి , ‘బీహార్‌ కా తేజస్వి ప్రాణ్’ అనే పేరుతో తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఒక చట్టాన్ని ఆమోదిస్తామని హామీ ఇచ్చింది. ఇక జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్)లను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని తెలిపింది. నెలకు రూ. 30 వేల జీతం ఇస్తామని వెల్లడించింది. బీహార్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad