NEET exam conducted in CBT: నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు ఎన్‌టీఏ పలు కీలక వివరాలు వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకవ్వగా.. ఆ పరీక్షను రద్దు చేశారు. దీంతో, భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు చోటుచేసుకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది.
Also read: Nara Lokesh: టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్.. కార్యకర్తలకు అంకితమన్న నారా లోకేశ్

