Thursday, July 10, 2025
Homeనేషనల్ALERT: బ్యాంక్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి మారుతున్న రూల్స్ ఇవే

ALERT: బ్యాంక్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి మారుతున్న రూల్స్ ఇవే

Banking Rules: కేంద్ర ఆర్ధిక శాఖ నేటి నుంచి ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ నెల నుంచి పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. వినియోగదారులపై ఆర్థికంగా ఈ మార్పులు నేరుగా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం, క్రెడిట్ కార్డ్ పేమెంట్ రూల్స్, సర్వీస్ ఛార్జీల విషయంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

- Advertisement -

ఈ మార్పుల కారణంగా ఇకపై కొత్తగా పాన్ కార్డు పొందాలనుకునే వారు తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలి. అలాగే ఇప్పటికే పాన్ ఉన్న వారు తమ ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే అది పని చేయకుండా మారవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు పన్ను దాఖలుకు గడువు కూడా జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించబడినట్లు సీబీడీటీ ప్రకటించింది.

SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేటి నుంచి తమ క్రెడిట్ కార్డులపై ఉన్న ప్రయాణ బీమా ప్రయోజనాల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. జూలై 15 నుంచి, ELITE, Miles ELITE, Miles PRIME వంటి కార్డులకు కోటి రూపాయల విమాన ప్రయాణ బీమా రద్దు చేయనుంది. అలాగే PRIME, PULSE కార్డుల ద్వారా అందిస్తున్న ₹50 లక్షల కవర్ కూడా రద్దు కానుంది. వీటితో పాటు ఇతర మార్పుల్లో భాగంగా, మినిమమ్ డ్యూ లెక్కించే విధానంలో సైతం మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రభావం క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై భారీగా పడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

HDFC బ్యాంక్ ఛార్జీల మార్పులు

HDFC బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై జూలై 1 నుంచి కొన్ని కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకువస్తోంది. అద్దె చెల్లింపులు, ఆన్లైన్ గేమింగ్, యుటిలిటీ బిల్లులు, వాలెట్ లోడింగ్ తదితరాలపై 1 శాతం చార్జీలు విధించనుంది. దీనికి నెలవారీ పరిమితి కూడా విధించింది. దీని వలన ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించే వారికి అధిక భారం పడడంతో పాటు.. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు.. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా జూలై 1 నుంచి ATM మరియు ఇతర సర్వీసులకు సంబంధించిన ఛార్జీల్లో మార్పులు చేయనుంది. ప్రతి నెల మొదటి 5 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఉచితం కాగా, ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీకి ₹23 చార్జ్ వసూలు చేయనుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు మాత్రం ఉచితంగానే ఉంటాయని తెలిపింది. అదనంగా, క్యాష్ డిపాజిట్, బ్రాంచ్ విత్‌డ్రా, IMPS లాంటి సేవల ఛార్జీల్లోనూ సవరణలు చేపట్టింది. ఈ మార్పులన్నీ వినియోగదారుల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే బ్యాంకింగ్, పన్ను సంబంధిత అంశాల్లో అప్డేట్లు గమనిస్తూ, ముందుగానే తగిన చర్యలు తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News