Saturday, October 5, 2024
Homeనేషనల్New Delhi: ఢిల్లీలో వణికించే చలి..ఆరెంజ్ అలర్ట్..హీటర్లే దిక్కు

New Delhi: ఢిల్లీలో వణికించే చలి..ఆరెంజ్ అలర్ట్..హీటర్లే దిక్కు

ఢిల్లీలో ఈ ఏడాది చలి భయంకరంగా వణికించేస్తోంది. మొన్నటికి మొన్న నైనిటాల్ తో పోటీ పడేలా న్యూఢిల్లీ ఉష్ణోగ్రతలు పడిపోగా తాజాగా జస్ట్ 3 డిగ్రీలు నమోదైంది. ఉదయం 5-30 గంటలకు విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. కంటి ముందున్నవి కూడా కనిపించని స్థాయిలో దట్టమైన పొగ మంచు దుప్పటి ఢిల్లీ నగరాన్ని కప్పేస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతోంది. హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి ఈదురు గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోఢి రోడ్ వంటి ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఏకంగా 2.2 డిగ్రీలకు పడిపోవటం విశేషం. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టర్ అంతా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ కోడ్ లాంగ్వేజ్ లో ఆరెంజ్ అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్ అని అర్థం. ఇక ఢిల్లీ నగరంలోని వీధులు సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున చాలావరకు ఎటువంటి రద్దీ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి. రాజధానిలో హీటర్ల ఉపయోగం ఈ ఏడాది బాగా పెరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News