Sunday, July 7, 2024
Homeనేషనల్New Expressway: ఢిల్లీ-డెహ్రాడూన్ 2 గంటలే, ఢిల్లీ-హరిద్వార్ 90 నిమిషాలే

New Expressway: ఢిల్లీ-డెహ్రాడూన్ 2 గంటలే, ఢిల్లీ-హరిద్వార్ 90 నిమిషాలే

ఢిల్లీ నుంచి హరిద్వార్, డెహ్రాడూన్ చేరుకోవటం ఇక నిమిషాల్లో పని.  కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సరికొత్త ఎక్స్ ప్రెస్ వే ఈ డిసెంబరు నుంచి అందుబాటులోకి రానుంది.  ఈ ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి రాగానే ఢిల్లీ నుంచి హరిద్వార్ కు కేవలం 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు 2 గంటల్లో చేరుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.  అయోధ్య పర్వ్ లో పాల్గొన్న కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఈమేరకు వివరాలు వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

- Advertisement -

ఢిల్ల-డెహ్రాడూన్ దూరం 212 కిలోమీటర్లు కాగా ఈ దూరాన్ని త్వరగా ప్రయాణించేలా పూర్తీచేసేందుకు కనెక్టివిటీ పెంచేందుకు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను 12,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60-70 శాతం నిర్మాణం పనులు పూర్తయ్యయాని ఇది 6 లేన్ల హైవే అంటూ గడ్కరీ వివరించారు.  అత్యాధునిక టెక్నాలజీ మాత్రమే కాదు, అండర్ పాస్ లతో ఫారెస్ట్ ఏరియా, జంతువుల సంరక్షణకు భంగం కలగకుండా ఈ హైవే నిర్మిస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News