HomeTop StoriesGreen card rules: గ్రీన్‌కార్డుల జారీపై అమెరికా కొత్త రూల్స్‌.. వారికి మాత్రమే మినహాయింపు..!

Green card rules: గ్రీన్‌కార్డుల జారీపై అమెరికా కొత్త రూల్స్‌.. వారికి మాత్రమే మినహాయింపు..!

New green card rules: అగ్రరాజ్యం అమెరికా గ్రీన్‌ కార్డులకు ఎంతటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్రీన్‌ కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు చాలా మంది. అయితే, ట్రంప్‌ రాకతో వలసదారుల ఆశలు ఆవిరవుతున్నాయి. ట్రంప్‌ కఠిన నిబంధనలతో అమెరికాలో గ్రీన్‌ కార్డు పొందంటం మరింత కష్టతరంగా మారింది. తాజాగా, అమెరికా గ్రీన్‌కార్డుపై కొత్త రకమైన రూల్స్‌ తీసుకొచ్చింది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టంచేసింది. అయితే, ఈ రూల్ అందరికీ కాదని స్పష్టం చేసింది. ఈ రూల్స్‌ నుంచి కొందరికి మినహాయింపు ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ‘‘అమెరికా ప్రయోజనాలు లేక ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు మాత్రమే ఈ రూల్స్‌ నుంచి మినహాయింపులు ఇస్తాం. దరఖాస్తుదారుడి వల్ల మా దేశానికి ప్రయోజనం ఉందని భావిస్తే.. వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం. దాంతో వారు ప్రస్తుతం నిబంధనల ప్రకారమే కొనసాగే అవకాశం ఉంటుంది. మిగతా వారిని వారి మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోమని సూచిస్తాం.’’ అని యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి జాక్‌ కహ్లర్‌ వెల్లడించారు.

- Advertisement -

Also read: Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 82.94 శాతం ఉత్తీర్ణత

అమెరికా పౌరుల ప్రయోజనాలే ఫస్ట్‌..

కాగా, గ్రీన్‌ కార్డు దరఖాస్తులు.. తమ దేశానికి ప్రయోజనం కలిగించే వ్యక్తుల నుంచి వచ్చిన దరఖాస్తులు అని ఎలా నిర్ణయిస్తారో మాత్రం అధికారులు వెల్లడించలేదు. ముందురోజు వెలువరించిన గ్రీన్‌కార్డ్ నిబంధనల ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లోనే ఇందుకు మినహాయింపు ఉంటుందని జాక్‌ కహ్లర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకొనే వారి విషయంలో అధికారులు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త రూల్స్‌తో చట్టంలోని లోపాలను ఉపయోగించుకుంటూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలతో ప్రధానంగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూసే భారతీయులపై ఎక్కువ ప్రభావం పడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News