Sunday, November 16, 2025
HomeTop StoriesGST Complaints: జీఎస్టీ తగ్గినా పాత ధరలకే అమ్ముతున్నారా?.. అయితే, ఇలా ఫిర్యాదు చేయండి

GST Complaints: జీఎస్టీ తగ్గినా పాత ధరలకే అమ్ముతున్నారా?.. అయితే, ఇలా ఫిర్యాదు చేయండి

New Portal for GST Complaints: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల షాంపూ, సబ్బు, బేబీ ఉత్పత్తులు, జీవిత, ఆరోగ్య బీమా వంటి అనేక రోజువారీ వస్తువులు చౌకగా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా వన్‌ నేషన్‌-వన్‌ టాక్స్‌ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, కొత్త జీఎస్టీ రేట్ల వల్ల ఆయా వస్తువుల రేట్లు తగ్గినప్పటికీ.. చాలా మంది పాత రేట్లకే వస్తువులను అమ్ముతున్నారు. దీంతో, కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులను స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా కొత్త రేట్లు, బిల్లింగ్, డిస్కౌంట్లకు సంబంధించి ఏమైనా తేడాలుంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. కొత్త వ్యవస్థ కింద జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులు చేయడానికి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ https://consumerhelpline.gov.in ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం (IGRAM) పోర్టల్‌లో ఒక ప్రత్యేక కేటగిరిని సృష్టించారు. ఆటోమొబైల్, బ్యాంకింగ్, FMCG, ఇ-కామర్స్ వంటి రంగాలకు సంబంధించి ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/snake-bite-in-uttar-pradesh/

వాట్సాప్‌, ఈ-మెయిల్‌, ఉమాంగ్‌ యాప్స్‌ ద్వారా..

మీరు మీ ఫిర్యాదులను టోల్-ఫ్రీ నంబర్ 1915, ఎన్‌సీహెచ్‌ యాప్, వెబ్ పోర్టల్, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ఈ-మెయిల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సేవ హిందీ, ఇంగ్లీష్, తమిళం, బెంగాలీ, గుజరాతీ, అస్సామీలతో సహా 17 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. మీ ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన డాకెట్ నంబర్ అందుకుంటారు. దీని ద్వారా మీ ఫిర్యాదును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. సకాలంలో పరిష్కారం చూపిస్తారు. ఈ పోర్టల్ కస్టమర్లకు చాలా ఉపయోగపడుతుందని, జీఎస్‌టీ రేటు తగ్గింపు వల్ల వచ్చే ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు దక్కేలా చేయడమే ఈ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇది రిటైల్ రంగంలో పన్ను సంస్కరణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం జీఎస్‌టీకి సంబంధించిన మరో కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా జీఎస్‌టీ అమలుకు ముందు, ఆ తరువాత ధరలను పోల్చి చూసుకోవచ్చు. ప్రతి వస్తువుపై మీరు ఎంత ఆదా చేస్తారో తెలుసుకోవచ్చు. ఇందు కోసం http:savingwithgst.in వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, స్నాక్స్ వంటి వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఓ వైపు జీఎస్టీ  తగ్గడం, మరోవైపు, పండుగ ఆఫర్ల నేపథ్యంలో అనేక వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad