Saturday, November 15, 2025
Homeనేషనల్NHAI Offer: పండగ వేళ గుడ్‌న్యూస్.. ఇకపై ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.. ఎలాంటే?

NHAI Offer: పండగ వేళ గుడ్‌న్యూస్.. ఇకపై ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.. ఎలాంటే?

NHAI Good News for the Fastag Users Ahead of Diwali Festival: దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాదారులకు ఫాస్టాగ్‌ వార్షిక టోల్‌పాస్‌ను ఆగస్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయాణికులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వార్షిక టోల్‌పాస్‌ను మీకు నచ్చిన వాళ్లకి బహుమతిగా ఇవ్వొచ్చని పేర్కొంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమార్గ అనే యాప్‌ ద్వారా ఈ పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు ముందుగా ఈ యాప్‌లోని యాడ్‌ పాస్‌ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీరు వార్షిక పాస్‌ను ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారో వారి వాహన నెంబర్, కాంటాక్ట్‌ వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. దేశంలో ఉన్న 1150 టోల్‌ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ పనిచేస్తుంది. ఒక్కసారిగా రూ.3 వేలు చెల్లించి ఈ పాస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్షిక పాస్‌తో ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్‌ ప్లాజాలు దాటొచ్చు. ఈ రెండింట్లో ఏది ముందు అవుతుందో అప్పటి వరకు ఈ పాస్‌ చెల్లుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ కేవలం ప్రైవేట్ నాన్‌ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. రాజమార్గ యాప్‌లో దీన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత కేవలం రెండు గంటల్లోనే ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఫాస్టాగ్‌ పాస్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రారంభమైన రెండు నెలల్లోనే ఏకంగా 25 లక్షల మంది దీన్ని ఎంచుకున్నారు. ఈ పాస్‌ ద్వారా ఇప్పటివరకు మొత్తం 5.67 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-bandh-over-bc-reservations/

మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటే ఫోటో పెట్టండి..

కాగా, టోల్ ప్లాజాల దగ్గర పరిశుభ్రతను మెరుగుపర్చాడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టోల్ ప్లాజాల వద్ద ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని సమాచారం ఇచ్చే వారికి బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు ఉన్న ఫొటో పెట్టివారికి రూ.1000 వరకు రివార్డుగా వారి ఫాస్టాగ్ అకౌంట్‌లోకి యాడ్ చేస్తారు. అయితే, ఈ ఫొటోను ‘రాజ్ మార్గ్’ అనే యాప్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫొటోతో పాటుగా, యూజర్‌ పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు పంపాలి. అప్పుడు యూజర్ పంపిన ఫొటోను ఎన్‌హెచ్‌ఐ అధికారులు పరిశీలిస్తారు. ఫొటో అర్హత కలిగి ఉందని నిర్ధారించిన తర్వాత రూ. వెయ్యి బహుమతిని వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న ఫాస్టాగ్ అకౌంట్‌కు జమ చేస్తారు. అయితే, ఎన్‌హెచ్‌ఐ నిర్వహించిన ఈ నూతన కార్యక్రమం అక్టోబర్‌ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. దీనివల్ల టోల్ ప్లాజాలు పరిశుభ్రంగా తయారై.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎన్‌హెచ్ఐ భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad