Tamilnadu Lockup Death Case: తమిళనాడులో 2020లో జరిగిన తండ్రీకుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్‌డౌన్ సమయంలో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్‌ను పోలీసులు లాకప్‌లో వేసి విచారణ పేరుతో హింసించడం అప్పట్లో సంచలనంగా మారింది.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-says-special-focus-on-adilabad-district/
తూత్తుకుడి జిల్లా శాతంకుళం పోలీస్ స్టేషన్‌లో జరిగిన తండ్రీకొడుకులసంచలనాత్మక కస్టడీ మరణాల కేసులో మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ తీర్పు వెల్లడించారు.
జూన్ 2020లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ షాపు తెరిచారన్న నెపంతో పోలీసులు.. తండ్రి పి. జయరాజ్(58), కుమారుడు జె. బెన్నిక్స్ (31)లను అదుపులోకి తీసుకుని లాకప్‌లో వేశారు. పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై అమానుషంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేయడంతో తీవ్ర గాయాల పాలైన బెన్నిక్స్ జూన్ 22న, జయరాజ్ జూన్ 23న ప్రాణాలు విడిచారు.
Also Read: https://teluguprabha.net/national-news/only-digital-payments-at-toll-plazas-from-april-10th/
ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్‌తో పాటు మరో ఆరుగురు కానిస్టేబుళ్లను(మురుగన్, సామదురై, ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వెయిలుముత్తు) కోర్టు దోషులుగా తేల్చింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి అమాయకుల ప్రాణాలు తీయడం అరుదైన నేరమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరణశిక్షతో పాటు బాధితుల కుటుంబానికి రూ. 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసును తొలుత సీబీసీఐడీ విచారించింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మొత్తం 10 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ సమయంలో ఒకరు చనిపోయారు.

