IIT Madras: దేశంలోనే టాప్.. ఐఐటీ మద్రాస్
IIT Madras: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్ 2025)లో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మరోసారి సత్తా చాటాయి. ఈసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలోని టాప్ 100 విద్యాసంస్థల ర్యాంకులను ఎన్ఐఆర్ఎఫ్ రిలీజ్ చేసింది. చెన్నైఐఐటీ మద్రాస్ దేశంలో మొదటి స్థానం దక్కించుకుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలిచింది. ముంబైలోని ఐఐటీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. ఎయిమ్స్ ఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్ ) అనేది దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చేందుకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం ఇది. దీన్ని 2015లో స్థాపించారు. మొదటి ర్యాంకింగ్స్ 2016లో విడుదలయ్యాయి. విద్యాసంస్థలను వివిధ విభాగాల్లో ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఐదు ముఖ్యమైన పరిమితులపై ఆధారపడి ఉంటాయి. టీచింగ్, రీసెర్చ్, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఇంక్లూజివ్ అండ్ సామాజిక ఔట్రీచ్, పర్సెప్షన్ ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. ఉన్నత విద్యా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, విద్యార్థులు సరైన సంస్థలను ఎంచుకోవడానికి సహాయపడటం ఎన్ఐఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం.
ఓవరాల్ కేటగిరీ (టాప్ 10) విద్యాసంస్థలు
ఐఐటీ మద్రాస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు
ఐఐటీ బాంబే
ఐఐటీ ఢిల్లీ
ఐఐటీ కాన్పూర్
ఐఐటీ ఖరగ్‌పుర్
ఐఐటీ రూర్కీ
ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఢిల్లీ
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ
బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి
టాప్ 10 యూనివర్సిటీలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం , న్యూఢిల్లీ
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయం
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ
అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగఢ్
తెలంగాణలో టాప్ విద్యా సంస్థలు
ర్యాంక్ సంస్థ పేరు నగరం స్కోరు
12 ఐఐటీ హైదరాబాద్ హైదరాబాద్ 67.04
26 హైదరాబాద్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ 60.32
53 ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 55.24
63 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ వరంగల్ 53.23
89 ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 49.91


