Tuesday, September 17, 2024
Homeనేషనల్Nirma add: బీజేపీపై బీఆర్ఎస్ పోస్టర్ అటాక్స్

Nirma add: బీజేపీపై బీఆర్ఎస్ పోస్టర్ అటాక్స్

హైదరాబాద్ లో సరికొత్త పోస్టర్ వార్ స్టార్ట్ అయింది. నిన్న కవితను ఈడీ విచారించిన సందర్భంగానూ హైదరాబాద్ నగరంలో టైడ్ యాడ్ అంటూ పొలిటికల్ సెటైరికల్ పోస్టర్స్, హోర్డింగ్స్ వార్తల్లో నిలిచాయి. తాజాగా నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలుకుతూ వెలిసిన పోస్టర్లు దేశ దృష్టిని బాగా ఆకట్టుకుంటున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే పెరేడ్ కు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్ షాకు బీఆర్ఎస్ శ్రేణులు ఇలా వెటకారంగా స్వాగత తోరణాలు కట్టడం విశేషం. బీఆర్ఎస్ చెప్పీ చెప్పకుండా చెబుతున్న విషయంగా ఈ పోస్టర్స్ ను అభివర్ణిస్తున్నారు.

- Advertisement -

హిమంతా బిశ్వా శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, విరూపాక్ష, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, అరుణ్ ఖోట్కర్ అని పేర్లను సైతం ఈ నిర్మా పోస్టర్ లో ఉంచటం మరో హైలైట్. బీజేపీలోకి చేరకముందు వీరంతా అవినీతిలో కూరుకుపోయిన, కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో నలిగిపోగా వారంతా బీజేపీలో చేరి అగ్ని పునీతులైనట్టు ఈ యాడ్ వివరించటమే ఇందులో మర్మం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News