Nitin Gadkari react On E20 Petrol issue:సామాజిక మాధ్యమాల్లో కొద్దికాలంగా చర్చ జరుగుతున్న ఇథనాల్ అంశంపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా టార్గెట్ చేసుకొనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ వార్షిక సదస్సులో గురువారం నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈసందర్భంగా 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌పై వ్యక్తమవుతోన్న ఆందోళనలపై స్పందించారు. ఇంధన దిగుమతులకు ఇథనాల్ ఒక ప్రత్యామ్నాయమని అన్నారు. అందుబాటు ధరలో స్వదేశంలో ఉత్పత్తి అవుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ దోహదపడుతుందని తెలిపారు. కొందరు డబ్బులు చెల్లించి మరీ.. నాపై తప్పుడు ప్రచారు చేయిస్తున్నారని అన్నారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
దిగుమతి భారాన్ని తగ్గించడం మంచి చర్య కాదా?: సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకోవడానికి భారత్ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తోందని తెలిపారు. ఈ దిగుమతి భారాన్ని తగ్గించడం మంచి చర్య కాదా అని ప్రశ్నించారు. మొక్కజొన్న నుంచి తీసిన ఇథనాల్ వల్ల రైతులు రూ.45 వేల కోట్ల మేర లాభపడ్డారని నితిన్ గడ్కరీ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం కాలుష్యానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత స్థాయిలో కాలుష్యం కొనసాగితే దిల్లీ ప్రజలు 10 ఏళ్ల జీవితాన్ని కోల్పోతారంటూ తెలిపే నివేదికలు ఉన్నాయని నితిన్ గడ్కరీ గుర్తుచేశారు.
Also Read:https://teluguprabha.net/national-news/kharge-attacks-modi-shah-constitution-cross-voting/
అది అతి స్వల్పమే: 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్ పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందంటూ.. గతంలో పలు పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ భయాలన్నీ నిరాధారమైనవని తెలిపింది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా అవి లేవని కేంద్రం పేర్కొంది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని వ్యాఖ్యానించింది. మొక్కజొన్న నుంచి తీసిన ఇథనాల్ ఉపయోగించడం వల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపింది. ఇథనాల్ వల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ.. అది అతి స్వల్పమేనని పేర్కొంది.


