Sunday, February 8, 2026
HomeTop StoriesBJP President: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్.. ఏకగ్రీవ ఎన్నిక

BJP President: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్.. ఏకగ్రీవ ఎన్నిక

BJP New President Election: భారతీయ జనతా పార్టీ తన నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  పార్టీ అగ్రనేతలు నితిన్‌ నబీన్‌ పేరును సిఫారసు చేయగా.. ఆయన ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు.  

- Advertisement -

బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు పార్టీకి చెందిన అగ్ర నాయకులు సోమవారం.. ఈ పదవికి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్(45) పేరును సిఫారసు చేసిన విషయం తెలిసిందే. సోమవారం నితిన్‌ నబీన్‌ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే లక్ష్మణ్‌కు నామినేషన్ పత్రాల సెట్‌ను అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజుల, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/congress-announces-in-charges-for-municipal-elections/

ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నితిన్‌ నబీన్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు ముందే ప్రారంభించింది. ఈ మేరకు గత నెలలోనే ఆయనను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. తాజా ఎన్నికతో నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక ప్రస్తుతం నబిన్‌కు మద్దతుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూతో పాటు ఇతర రాష్ట్ర నాయకులు మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ మరియు ప్రమోద్ సావంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో వైపు బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నాయకులు నబిన్‌కు మద్దతుగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో నితిన్‌ నబీన్‌ 12 వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read: https://teluguprabha.net/crime-news/married-woman-sexual-harassment-in-hyderabad/

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని పార్టీ జాతీయ మండలి, రాష్ట్ర మండళ్ల ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఈ ప్రక్రియను పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒక రాష్ట్రానికి చెందిన ఎలక్టోరల్ కాలేజీలోని ఏ 20 మంది సభ్యులైనా కలిసి, నాలుగు పర్యాయాలు క్రియాశీల సభ్యుడిగా ఉండి, 15 సంవత్సరాల సభ్యత్వం ఉన్న వ్యక్తి పేరును జాతీయ అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News