Homeనేషనల్Bihar Assembly Election 2025: మళ్లీ నితీష్‌కే బీహార్‌ పగ్గాలు.. డిప్యూటీ సీఎంగా అతనికే ఛాన్స్‌?

Bihar Assembly Election 2025: మళ్లీ నితీష్‌కే బీహార్‌ పగ్గాలు.. డిప్యూటీ సీఎంగా అతనికే ఛాన్స్‌?

Nitish Kumar As Next Bihar CHief Minister: మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. ముందు నుంచే నితీష్ కుమార్ సీఎం కాబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే నితీష్ కుమార్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ ఇతర ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 243 స్థానాలకు గాను 202 సీట్లను గెలిచి ఘన విజయం సాధించింది. బీజేపీ బిహార్‌లో అత్యధికంగా 89 సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు జేడీయూ 85 సీట్లను కైవసం చేసుకొని పట్టు నిలుపుకుంది.

- Advertisement -

డిప్యూటీ సీఎంగా చిరాగ్‌ పాశ్వాన్‌?

ఎన్డీఏ కూటమిలోని చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి 19 సీట్లు సాధించింది. మరోవైపు జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ అతి ఎక్కువ సీట్లు సాధించడంతో బీజేపీ సీఎం సీటుపై కన్నేసినట్లు వార్తలొచ్చాయి. నితీష్‌ను వ్యూహాత్మకంగా పక్కన పెట్టి బీజేపీ అభ్యర్థినే సీఎం చేయాలని మోదీ షా ద్వయం ప్లాన్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, ఎట్టకేలకు సీఎంగా నితీష్ కుమార్‌ పగ్గాలు చేపట్టనున్నారు. తాజా నిర్ణయం ద్వారా నితీష్ కుమార్ 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత రెండు దశబ్దాల నుంచి నితీష్ కుమార్ బిహార్ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అయితే, ఈసారి యువనేత చిరాగ్ పాశ్వాన్ లేదా నితీష్ కుమార్‌కు సీఎం కుర్చీ అందే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ఎన్డీఏ అగ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం గాంధీ మైదాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నవంబర్ 17 నుండి 20 వరకు గాంధీ మైదాన్‌ను సాధారణ ప్రజల సందర్శనకు మూసివేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News