Saturday, March 1, 2025
Homeనేషనల్NO Fuel: 15 ఏళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంద్

NO Fuel: 15 ఏళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంద్

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత పెట్రోల్, డీజిల్ కొట్టొద్దంటూ(NO Fuel) ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకులలో 15సంవత్సరాలు పైబడిన పాత వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోగ్‌ గన్లను అమర్చాలని ఆదేశించారు. డిసెంబర్ 2025 నాటికి ఢిల్లీలో దాదాపు 90 శాతం ప్రభుత్వ CNG బస్సులను దశలవారీగా నిలిపివేసి, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ వాసులకు పెద్ద సమస్యగా మారిన వాయు కాలుష్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News