ఓవైపు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఉద్యోగ జీవులు కీలక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఆదాయపన్ను శ్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఇక నుంచి రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను(Income Tax) ఉండదని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు వివరించారు. తాజా మార్పులతో కూడిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.